లోన్ ఆమోదం కోసం ఆర్థిక కంపెనీలు మరియు రుణదాతలకు అవసరమైన ఒక గణనీయమైన గుర్తింపునకు ఆధారం పాన్ కార్డ్. పాన్ కార్డ్ రుణగ్రహీత యొక్క ఆర్థిక చరిత్రని ప్రతిబింబిస్తుంది మరియు తమ చెల్లింపు సామర్థ్యం గురించి రుణదాతలకు ఒక అంచనాని ఇస్తుంది. రూ. 50,000 లేదా అంతకంటే ఎక్కువ పర్సనల్ లోన్ విషయంలో పాన్ కార్డ్ తప్పనిసరిగా సమర్పించవలసిన డాక్యుమెంట్.
మీ క్రెడిట్ స్కోర్ తెలుసుకోవడానికి అధికారిక సిబిల్ వెబ్ సైట్ ని సందర్శించండి. పాన్ కార్డ్ నంబర్ ఎంటర్ చేయండి మరియు సిబిల్ స్కోర్ కోసం మీ అభ్యర్థనని సమర్పించండి. 700 నుండి 750కి మరియు అంతకంటే ఎక్కువకి స్కోరింగ్ చేయడం లోన్ కోసం మీ పాన్ కార్డ్ అర్హతని నిర్థారిస్తుంది. పాన్ కార్డ్ లేనట్లయితే, దరఖాస్తుదారులు తమ వ్యక్తిగత వివరాలతో పాటు ఇతర కేవైసీ పత్రాల్ని కూడా సమర్పించాలి.
ఒకవేళ మీరు సంవత్సరాలు తరబడి రుణదాతతో విధేయతపూర్వకమైన సంబంధాన్ని పంచుకొని ఉంటే, ఏవైనా పత్రాలు అవసరం లేకుండా రుణగ్రహీతలు ప్రీ-అప్రూవ్డ్ లోన్స్ ప్రయోజనం పొందుతారు. మీ మొబైల్ నంబర్ కి అనుసంధానం చేయబడిన ఆధార్ మరియు పాన్ కార్డ్ యూనిక్ నంబర్ సహా కేవైసీ వివరాలు యొక్క ధృవీకరణతో మినీ లోన్స్ ఆమోదించబడవచ్చు.
రూ. 50,000 నుండి రూ. 1,50,000 మధ్య శీఘ్ర పర్సనల్ లోన్ పొందడానికి హీరోఫిన్‌కార్ప్ ఇన్ స్టెంట్ లోన్ యాప్ లో ప్రయత్నించండి. ఇది భారతదేశంలో విశ్వశనీయమైన ఆర్థిక కంపెనీ హీరోఫిన్ కార్ప్ ద్వారా ప్రారంభించబడిన ఆన్ లైన్ లోన్ వ్యవస్థ. రూ. 50,000 మరియు ఎక్కువ పర్సనల్ లోన్ పొందడానికి అర్హత ప్రమాణాన్ని మనం చూద్దాం:
పర్సనల్ లోన్ అర్హత విషయంలో రుణగ్రహీత యొక్క నెలవారీ ఆదాయం ముఖ్యమైనది. పర్సనల్ లోన్స్ కోసం వివిధ రుణదాతలకు వివిధ రకాల ప్రమాణాలు ఉంటాయి.
రూ. 50,000 పర్సనల్ లోన్ దరఖాస్తు కోసం ఈ క్రింది అర్హత ప్రమాణాన్ని నెరవేర్చాలి
- భారతీయ పౌరసత్వం గురించి ప్రూఫ్
- ఆరు నెలలు బ్యాంక్ స్టేట్మెంట్ మరియు ఆదాయం ప్రూఫ్స్ గా జీతం రసీదు
- 21-58 సంవత్సరాలు మధ్య దరఖాస్తుదారుకి వయస్సు అర్హత ప్రమాణం
- మీరు జీతం తీసుకుంటున్న వ్యక్తియై ఉండాలి లేదా స్వయం ఉపాధి కలిగిన స్వతంత్ర వ్యక్తి/వ్యాపారియై ఉండాలి
- ప్రైవేట్ లేదా ప్రభుత్వ రంగంలో/తో పని చేస్తూ ఉండాలి
- మీ రుణం చరిత్ర రుణదాత ఏర్పాటు చేసిన అర్హతని తప్పనిసరిగా నెరవేర్చాలి. వివిధ రుణదాతలు తమ ప్రామాణాలు ప్రకారం వివిధ స్థాయిల్ని ఏర్పాటు చేస్తారు కాబట్టి క్రెడిట్ స్కోర్ వేరుగా ఉండవచ్చు
రూ. 50,000 లేదా అంతకంటే ఎక్కువ జీతంతో లోన్ ఆమోదానికి అర్హత ప్రమాణంతో పాటు తప్పనిసరి డాక్యుమెంట్ల సెట్ కూడా కావాలి
- ప్రామాణిక కేవైసీ పత్రాలు - ఆధార్ కార్డ్, డ్రైవర్స్ లైసెన్స్, పాన్ కార్డ్, పాస్ పోర్ట్
- ఆదాయం పత్రాలు- జీతం తీసుకునే స్వతంత్ర వ్యక్తులు కోసం ఇటీవల జీతం రసీదులు మరియు స్వయం ఉపాధి వ్యక్తులు కోసం బ్యాంక్ స్టేట్మెంట్
రూ. 50,000 పర్సనల్ లోన్ కోరడంతో పాటు, ఈ క్రింది పరిస్థితులలో పాన్ కార్డ్ తప్పనిసరిగా ఉండవలసిన పత్రం
- కొత్త డెబిట్ లేదా క్రెడిట్ కార్డ్ కోసం దరఖాస్తు చేయడం
- కొత్త బ్యాంక్ అకౌంట్/డీమాట్ అకౌంట్ తెరవడం
- క్యాష్ డిపాజిట్ లేదా రూ. 50,000కి మించిన నగదు డిపాజిట్ చేయడం
- మ్యూచువల్ ఫండ్స్, బాండ్స్ మొదలైన వాటి కొనుగోలులో నిమగ్నమవడం
- రూ. 50,000 లేదా అంతకంటే ఎక్కువ ఫిక్స్ డ్ డిపాజిట్స్ చేయడం
- రూ. 50,000 లేదా అంతకంటే ఎక్కువగా బీమా ప్రీమియం చెల్లించడం
ఒకవేళ మీ పాన్ కార్డ్ స్థిరంగా లేని ఆర్థిక హోదాని చూపిస్తే, పర్సనల్ లోన్ ఇచ్చే రుణదాతలు భద్రతా కారణాలు మరియు డీఫాల్టర్స్ ని నివారించే దృష్ట్యా మీ లోన్ పై తాకట్టుని కోరవచ్చు. తమ పాన్ కార్డ్ ని పోగొట్టుకున్న రుణగ్రహీతలు కోసం మరియు ఇప్పటికీ రూ. 50,000 పర్సనల్ లోన్ కోసం దరఖాస్తు చేయాలని కోరుకునేవారు తమ ఆధార్ కార్డ్ ని ఉపయోగించవచ్చు.